![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -324 లో... మురారిని ఇంప్రెస్ చేయడానికి ముకుంద టీ షర్ట్ వేసుకొని రాగానే.. ఈ అవతారం ఏంటని మురారి అని ముకుందని డిజప్పాయింట్ చేస్తాడు. ఆ తర్వాత ముకుంద కోపంగా ఉంటుంది.. నాకు వర్క్ ఉంది వెళ్తున్నానంటూ మురారి వెళ్తుంటే నేను వస్తానని ముకుంద అనగానే.. అవసరం లేదని చెప్పి తనని పట్టించుకోకుండా మురారి వెళ్లిపోతాడు.
మరొకవైపు కృష్ణ తన చిన్నాన్నని కలిసి వస్తుంది. అలా వచ్చిన కృష్ణని.. ఏం అన్నారని శకుంతల అడుగుతుంది. నేను ఎందుకు ఈ పని చేసానో ముందు ముందు నీకే తెలుస్తుందని చిన్నాన్న అన్నాడని శకుంతలకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మధు వచ్చి నిన్ను బ్రేక్ ఫాస్ట్ కి పెద్దమ్మ రమ్మంటుందని తీసుకొని వెళ్తాడు. భవానీతో మాట్లాడటానికి ముకుంద వస్తుంది. ఇంట్లో అందరు కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారని ముకుంద అంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కిందకి వెళ్ళు అని ముకుందకి భవాని చెప్తుంది. ఇప్పుడు అత్తయ్య ఏదో కృష్ణ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంది. అందరు షాక్ అవుతారని ముకుంద అనుకుంటుంది. రేవతి, నందు, గౌతమ్ అందరు.. కృష్ణని భవాని బ్రేక్ ఫాస్ట్ కి ఎందుకు పిలిచిందని టెన్షన్ పడుతుంటారు. అప్పుడే భవాని వచ్చి.. టిఫిన్ ఏం చేసావని అడుగుతుంది. అప్పుడే కృష్ణని మధు తీసుకొని లోపలికి వస్తాడు.
ఆ తర్వాత మురారి ఇంట్లో లేని టైమ్ లో.. కృష్ణ ని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచి తన నిర్ణయం చెప్తుంది. ముకుంద, మురారీల అమెరికా ప్రయాణం కాన్సిల్ చేస్తున్నాను. ఎలాగూ ఆదర్శ్ తిరిగి వచ్చేలా లేడు. ముకుంద, మురారికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను. నాకు ముందు తెలియక ముకుంద ఆదర్శ్ లకి పెళ్లి చేసాను. ఇక నీది, మురారిది అసలు పెళ్లి కాదు. ఇందులో ఎలాంటి మార్పు లేదని భవాని అనగానే అందరూ షాక్ అవుతారు. ముకుంద మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ కోసం తన ఇంటికి మురారి వెళ్తాడు. తరువాయి భాగంలో.. బాధగా వస్తున్న కృష్ణని చూసి మురారి షాక్ అవుతాడు. అదే సమయంలో.. నీ గతంలో ఏం జరిగిందో చెప్పాలని అనుకుంటన్నానని భవాని అనగానే.. చెప్పు పెద్దమ్మ నా గతం తెలుసుకోవాలని నాకు ఉంది అని అనగానే.. నీ గతం లో నువ్వు ముకుందతో ప్రేమ లో ఉన్నావని భవాని అనగానే మురారి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |